కుత్బుల్లాపూర్: గాజుల రామారంలో గవర్నమెంట్ ల్యాండ్ ని వెంచర్ చేసి.. OLXలో అమ్మకానికి పెట్టారని కుత్బుల్లాపూర్ బిజెపి నాయకుడు ఆకుల సతీష్ డిప్యూటీ ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. సర్వే నం.307 గాజుల రామారం, బాలయ్య బస్తీ పక్కన ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, రెవెన్యూ, మున్సిపల్ అనుమతులు లేకుండా 477 ప్లాట్లుగా చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి, అమాయకపు ప్రజలకు అంటగట్టాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకొవాలని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ | మూసీ టెండర్ అగ్రిమెంట్ రూ.141 కోట్లు మాత్రమే: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజలు మోసపోకుండా ఆ భూమికి తక్షణమే భద్రత కంచే వేసి, ప్రభుత్వ స్థలం కాపాడాలని ఆకుల సతీష్ కుత్బుల్లాపూర్ డిప్యూటీ ఎమ్మార్వోకి కప్లెయింట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడే పనిలో ఉంటే.. కుత్బుల్లాపూర్ లో కొందరు బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేస్తూ,పేద ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆయన మండి పడ్డారు. గతంలో ఇదే 307 సర్వే నంబర్ లో ఆక్రమణలు కూల్చినా, యథేచ్చగా మళ్ళీ నిర్మాణాలు చేపట్టడం అధికారుల అలసత్వానికి నిదర్శనం అంటూ ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి.. ప్రభుత్వ భూములు కాపాడాలని, భూకబ్జాకోరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.