యూజ్ లెస్ ఫెలో..పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ గేట్ దగ్గర కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ ని యూజ్ లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయి.. పోలీసుల లాఠీ తీసుకొని కారు అద్దంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సంజయ్ వివేకానందను ఉద్దేశించి “సార్ నాకు తిట్టడం రాదు. నేను రూల్స్ ప్రకారమే వ్యవహరిస్తున్నా ” అంటూ సమాధానమిచ్చారు. 

అంతకుముందు ఆటో డ్రైవర్ల సమస్యలపై హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. అసెంబ్లీ లోపలికి ఆటోల్లో వెళ్లేందుకు నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ప్లకార్డులను అసెంబ్లీ లోపలికి అలో చేయమని పోలీసులు చెప్పటంతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని,చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.