ఫోర్త్​సిటీ ఓ కల్పితం .. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ఫోర్త్​సిటీ ఓ కల్పితం .. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ దందా కోసమే సీఎం రేవంత్ ఫోర్త్​ సిటీని తీసుకొస్తున్నారని, రియల్ ఎస్టేట్ ఏజెంట్​లా సీఎం పని చేస్తున్నారని కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గురువారం హైదరాబాద్ బీఆర్​ఎస్​ భవన్​లో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 

ఫోర్త్ సిటీ అనేది ఒక కల్పిత సిటీ అని, రేవంత్​ రెడ్డి ఊహల్లోనే అది కనిపిస్తుందని ఆయన హేళన చేశారు. డిమాండ్ ఉన్న ప్రాంతంలో కాకుండా, ఫోర్త్ సిటీకి మెట్రో రైల్​ ప్రతిపాదనలు చేయడం ఏంటని ప్రశ్నించారు.