ఎన్నో ఆశలతో ఒక్కటవుతారు...పెళ్లి అనే బంధంతో నూరేళ్లు కలిసి జీవించాలనుకుంటారు. వివాహ సమయంలో పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు.పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. కానీ నేటి యువత అందుకు భిన్నంగా ఉన్నారు. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు కాని చిన్న చిన్న కారణాలకే విడిపోవడం.. విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఇప్పుడు ఓ జంట అలా పెళ్లి చేసుకున్నారో.. కేవలం మూడు నిమిషాల్లోనే అర్ధాంతరంగా వివాహబంధాన్ని ముగించి విడాకులు తీసుకున్నారు. ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారో తెలియాలంటే ఈ వార్తపై ఓ ఓ లుక్కేయండి
పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లేక్కింది.ఈ షాకింగ్ ఘటన గల్ఫ్ దేశం కువైట్ లో జరిగింది.పెళ్లి అయిన మూడు నిమిషాలకే వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని విసుక్కున్నాడు.దీంతో ఆ యువతి వెంటనే విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించి..విడాకులు పొందింది.
Viral News: పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లేక్కింది. ఈ షాకింగ్ ఘటన గల్ఫ్ దేశం కువైట్ లో జరిగింది. పెళ్లి తంతు పూర్తయ్యి పెళ్లి వేడుక నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో అనుకోకుండా పెళ్లి కూతురు కొంచెం స్లిప్ అయ్యి కింద పడింది. ఆ సమయంలో పక్కనే ఉన్న వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని కొంచెం విసుక్కున్నాడు.
దాంతో ఆ మాట విన్న పెళ్లి కూతురు ఆ నిమిషమే అతనికి విడాకులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నానని పెళ్లి వారితో చెప్పి అక్కడ నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టులో విచారణ ముగిసిన తరువాత కోర్టు విడాకులు మంజూరు చేసేసింది.
కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా దీనిని కోర్టు పేర్కొంది. నిజానికి 2019లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు గా సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది.. పెళ్లి వేదికపై వరుడు.. అవమానించాడని వధువు మనస్తాపానికి గురై మ్యారేజ్‌ను రద్దు చేసుకుంది. తనకు విడాకులు ఇప్పించాలని జడ్జిని కోరింది. ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయమూర్తి.. భార్యాభర్తలుగా ప్రకటించిన 3 నిమిషాలకే వారిద్దరికి విడాకులు మంజూరు చేశాడు.
అయితే ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు. ప్రారంభంలోనే ఇలా విడిపోవడం మంచిదైందని వ్యాఖ్యానించారు. పెళ్లయ్యాక రోజు గొడవ పడేకంటే అప్పుడే విడిపోవడం కరెక్ట్ అని రాసుకొచ్చారు. మరికొందరు ఆయా రకాలుగా అభిప్రాయాలు పంచుకున్నారు.
ఇలాంటిదే 2004లో యూకేలో ఒక జంట పెళ్లై 90 నిమిషాల తర్వాత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. రిజిస్టర్ ఆఫీస్‌లో మెక్కీ, విక్టోరియా ఆండర్సన్ అనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ తోటి బంధువులు పెళ్లికూతుళ్లను ఇబ్బంది పెట్టినందుకు పెళ్లి కొడుకుపై వధువు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరగడంతో ఆ యువతి కూడా కేవలం గంటన్నరలోనే విడాకులు తీసుకుంది.