ఇండియా, కువైట్ దేశాల మధ్య మంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. కువైట్ రేడియోలో తొలిసారిగా హిందీ కార్యక్రమాన్ని ప్రసారం చేసినట్లు భారత రాయబారి కార్యాలయం సోమవారం తెలిపింది. ఈక్రమంలో కువైట్ సమాచార మంత్రిత్వ శాఖను ఇండియన్ ఎంబసీ ప్రశంసించింది. ప్రతి ఆదివారం FM 93.3 మరియు AM 96.3 కువైట్ రేడియో స్టేషన్లలో రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు హిందీ బ్రాడ్ కాస్ట్ ప్రసారం చేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 21 నుంచి ప్రారంభించారు.
ఇంజనీర్లు, వైద్యులు, సీఏలు, సెంటిస్టులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఆర్కిటెక్ట్‌లు, నర్సులు, బిజినెస్ మెన్లు వంటి వివిధ ప్రొఫెషన్లలో చాలామంది ఇండియన్స్ కువైట్ లో ఉన్నారు. సుమారు 10 లక్షల మంది ప్రవాస బారతీయులు కువైట్ లో ఉన్నారని ఇండియన్ ఎంబసీ తెలిపింది. ఈ చర్య రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.