బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కేవీ రంగా కిరణ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కేవీ రంగాకిరణ్​ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి మంగళవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు.

జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనేరు సత్యనారాయణ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీఆర్​ఎస్​లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్​ నేత, ఆర్కె ట్రస్ట్​ అధినేత రంగా కిరణ్​ను జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల తమిళనాడు స్టేట్​ ఇన్​చార్జి, జాతీయ నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్​రావు గౌడ్​, తదితరులు అభినందనలు తెలిపారు