చట్టసభల్లో మహిళలకు పెద్ద పీట : కేవీ రంగా కిరణ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మహిళల సంక్షేమానికి  బీజేపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీ రంగా కిరణ్ అన్నారు. మహిళా రిజర్వేషన్​ బిల్లు పార్లమెంట్​లో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ  పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లు ఆమోదం పొందడంలో ప్రధాని మోదీ కీలక భూమిక పోషించారన్నారు.

ఈ బిల్లుతో చట్టసభల్లో మహిళల ప్రాధాన్యం మరింతగా పెరగనుందన్నారు. అనంతరం మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆకుల నాగేశ్వరరావు గౌడ్​,  చింతలచెర్వు శ్రీనివాసరావు,  జల్లారపు శ్రీనివాస్​, సాయిరాం, కటికల రంజిత్​, రాపాక రమేశ్,  కృష్ణ, అలువాల సందీప్​, వరలక్ష్మి, రమాదేవి, సమ్మక్క, ఉషారాణి పాల్గొన్నారు. 

Also Read :- మంత్రి హామీ అమలుచేయాలి

 సత్తుపల్లి, వెలుగు :  మహిళా బిల్లుకు ఆమోదం పొందడం పట్ల ప్రధాని మోదీ చిత్రపటానికి అంబేద్కర్ సర్కిల్ వద్ద  బీజేపీ నాయకులు, మహిళలు, శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో  ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, భాస్కర్ని వీరంరాజు,  మట్టా ప్రసాద్,  పాలకొల్లు శ్రీనివాస్, జొన్నల గడ్డ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

జూలూరుపాడు, వెలుగు : మహిళలకు చట్టసభలలో 33శాతం రిజర్వేషన్​ కల్పించినందుకుగాను శుక్రవారం బీజేపీ నాయకులు మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు భుక్యా కవిత,  చిలుకూరి రమేశ్,  నున్నా రమేశ్,  మాదినేని సతీశ్, ప్రసాద్, వీణ, శిరీష , సత్యావతి, పుల్లారావు, గోపాలరావు  పాల్గొన్నారు.