KKR vs PBKS: ‘‘ఏం ఫాల్తూ బ్యాటింగ్ బ్రో ఇది ’’ శ్రేయస్తో రహనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

KKR vs PBKS: ‘‘ఏం ఫాల్తూ బ్యాటింగ్ బ్రో ఇది ’’ శ్రేయస్తో రహనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐపీఎల్ అంటే ఊహకందని గేమ్. ఏ టైమ్ లో ఏం జరుగుతుందో.. ఎవరు గెలుస్తారో ప్రిడిక్ట్ చేయని ఆట. మంగళవారం (ఏప్రిల్ 15) కోల్ కతా vs పంజాబ్ మ్యాచ్ అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ. కేవలం 112 రన్స్ టార్గెట్ ను కాపాడుకుని పంజాబ్ గెలవటంపై క్రికెట్ అభిమానులు సర్ ప్రైజ్ కు గురయ్యారు. బ్యాటింగ్, ఆల్ రౌండ్ లైనప్ తో భారీ టార్గెట్ ను ఛేజ్ చేసే సత్తా ఉన్న కోల్ కతా.. కేవలం 112 రన్స్ టార్గెట్ ఛేజ్ చేయలేకపోవడం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. 

ఆడుతున్నది కోల్ కతానేనా అనేంతలా నోరెళ్లబెట్టారు అభిమానులు. మరోవైపు.. 111 రన్స్ చేసిన పంజాబ్.. ఇక మ్యాచ్ అయిపోయింది.. చూడటం వేస్ట్ అని సెకండ్ ఇన్నింగ్స్ చూడకుండా ఫోన్, టీవీలు పక్కనపెట్టిన వారే ఎక్కువ. కానీ ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ ను మెచ్చుకోక తప్పదు. 2024 లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక రన్స్ టార్గెట్ ను ఛేజ్ చేసిన పంజాబ్ (PBKS).. ఈ సీజన్ లో అత్యల్ప స్కోర్ ను కాపాడుకోవడం యాదృచ్ఛికంగా కనిపించినా అది నిజం. అది కూడా KKR పైనే కాకడం విశేషం. 

2024లో కోల్ కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా 262 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఈ స్కోర్ ను ఛేజ్ చేసి పంజాబ్ ఔరా అనిపించింది. ఛేదనలో ఆంగ్ క్రిష్ రఘువన్షీ (37), రస్సెల్(17), కెప్టెన్ రహానే(17) ఎంత పోరాటం చేసినా.. శ్రేయస్ అయ్యర్ టీమ్ ముందుకు సాగనివ్వలేదు.  చాహల్ 4 వికెట్లు తీసి ఈ మ్యాచ్ ట్రాక్ నే మార్చేశాడు. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో రెండు టీమ్స్ వైపు బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్లేయర్లు కూడా భారీ స్కోర్లు చేయలేక పోయారు. ప్రభుసిమ్రన్ సింగ్ (30), ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్ (18) రన్స్ మాత్రమే చేయగలిగారు. 

అయితే మ్యాచ్ ముగిశాక కెప్టెన్ రహానే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘‘ఏం ఫాల్తూ బ్యాటింగ్ బ్రో మాది’’ అంటూ శ్రేయస్ అయ్యర్ తో హ్యండ్స్ షేక్స్ చేస్తూ అనటం ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో రహానే కాంమెంట్స్ ట్రెండింగ్ గా మారాయి. మరాఠీ భాషలో రహానే శ్రేయస్ తో సరదాగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి ఫుల్ కామెంట్స్ వస్తున్నాయి.