క్రికెట్ లో బ్యాటింగ్, బౌలింగ్ ద్వారా మాత్రమే మ్యాచ్ మలుపు తిరుగుతుందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు కీలక దశలో పట్టే ఒక్క గ్రేట్ క్యాచ్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. అత్యద్భుతమైన క్యాచ్ లతో మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు ఇప్పటివరకు మనం చాలానే చూసాం. అలాంటి ఒక అద్భుతమైన క్యాచ్ ఒకటి శ్రీలంక, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో నమోదయింది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ సంచలన క్యాచ్ తో మెరిశాడు.
నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదివారం (డిసెంబర్ 8) సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన 8 ఓవర్ తొలి బంతిని ఆఫ్ సైడ్ దిశగా బౌలింగ్ చేశాడు. శ్రీలంక బ్యాటర్ కామిందు మెండీస్ ఈ బంతిని లెగ్ స్టంప్ మిస్ చేసి పూర్తిగా ఆఫ్ సైడ్ వచ్చి డిఫెన్స్ చేశాడు. బంతి లెగ్ సైడ్ దిశగా వెళ్ళింది. అయితే అప్పటివరకు ఆఫ్ సైడ్ వైపు వికెట్ కీపింగ్ చేస్తున్న వెర్రీన్ బంతి ఎటు వెళ్తుందో రెప్పపాటులో గమనించి డైవ్ చేసి మరీ క్యాచ్ పట్టేశాడు. ఈ క్యాచ్ సహచరులు కూడా ఊహించక పోవడం విశేషం.
ALSO READ | SA vs SL, 2nd Test: టెస్ట్ ఛాంపియన్ షిప్.. అగ్ర స్థానానికి దూసుకెళ్లిన సౌతాఫ్రికా
35 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న మెండీస్ స్టన్నింగ్ క్యాచ్ తో పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో కైల్ వెర్రీన్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఐదో రోజు 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌటైంది. దీంతో సోమవారం (డిసెంబర్ 9) శ్రీలంపై 109 పరుగుల భారీ విజయం సాధించడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియాను ధాటి టాప్ లో కి వెళ్ళింది.
Sharp Reflex Catch from Kyle Verreynne. pic.twitter.com/iHJ8QdXOny
— CricketGully (@thecricketgully) December 8, 2024