మేడిగడ్డ ఏడో బ్లాక్​ను బాగుచేస్తాం: ఎల్​అండ్​టీ ప్రకటన

హైదరాబాద్,వెలుగు: మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్​పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని ఎల్​అండ్​టీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన డిజైన్​లు, నాణ్యత ప్రమాణాలకు లోబడే తాము బ్యారేజీని నిర్మించి 2019లో ప్రభుత్వానికి అప్పగించామని తెలిపింది. గత ఐదేళ్లుగా భారీ వరదలను తట్టుకొని బ్యారేజీ నిలిచిందన్నారు. బ్యారేజీకి సంబంధించిన అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దెబ్బతిన్న ఏడో బ్లాక్​పునరుద్ధరణపై ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పనులు చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.