ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్ లాభం రూ.696 కోట్లు

ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్ లాభం రూ.696 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: నాన్-బ్యాంకు లెండర్​ ఎల్​అండ్​టీ ఫైనాన్స్​ పన్ను తర్వాత కన్సాలిడేటెడ్​ లాభం సెప్టెంబర్​ క్వార్టర్​ 17 శాతం పెరిగి రూ.696 కోట్లకు చేరుకుంది. ఈ  సంస్థ క్రితం ఏడాది కాలంలో రూ.595 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ తన మొత్తం ఆస్తుల వృద్ధి 18 శాతంగా ఉందని, లోన్​డిస్బర్స్​మెంట్లు రిపోర్టింగ్ క్వార్టర్లో 12 శాతం పెరిగాయని తెలిపింది. రిటైల్ లోన్​బుక్ వృద్ధి 28 శాతంగా ఉంది.  సెప్టెంబర్ 30, 2024 నాటికి దీని మొత్తం విలువ రూ. 88,795 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు  ఫీజులు 10.86 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.