ఖమ్మటౌన్/కల్లూరు, వెలుగు : కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎల్.రాజేంద్ర గౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నారాయణపేట నుంచి ఎన్నికల విధులలో భాగంగా కల్లూరుకు బదిలీపై వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా తనను నేరుగా కలిసి చెప్పొచ్చన్నారు. రాజేంద్ర గౌడ్ ను రెవెన్యూ డివిజనల్ సిబ్బంది, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ ను రాజేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించారు.