టీడీపీ అధ్య‌క్షుడిగా ఎల్. ర‌మ‌ణ, ఉపాధ్యక్షురాలిగా సుహాసిని

టీడీపీ అధ్య‌క్షుడిగా ఎల్. ర‌మ‌ణ, ఉపాధ్యక్షురాలిగా సుహాసిని

ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షులను ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు . ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌టించ‌గా… అలాగే తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా రమణకే మరోసారి అవకాశం లభించింది. ఇలా ఇరు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు వివిధ కమిటీలను కూడా చంద్రబాబు ప్రకటించారు. ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని అధిష్ఠానం ప్రకటించింది.

ఇక, 24 మంది సభ్యులతో కొత్త పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు.. 27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ప్రకటించారు.. కొత్తగా ప్రకటించిన కమిటీల్లో ఆరుగురిని వైస్‌ ప్రెసిడెంట్లుగా నియమించిన చంద్రబాబు.. సెంట్రల్‌ జనరల్ కమిటీ సభ్యులుగా మరో 8మందిని ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి లోకేష్ నియమితులయ్యారు. ఆయనతో పాటు వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు. బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్ రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్ లను నియమించారు. ఇక జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా పాటిల్, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, మెచ్చ నాగేశ్వరరావును నియమించారు.అయితే, ఎల్‌. రమణను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు.. చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినా.. మళ్లీ ఆయనకే అవకాశం కల్పించారు చంద్రబాబు.