- వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ పి.ఉదయ్‌కుమార్ వెల్లడి
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్మార్కెట్పనులు చేపడతామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఎల్.ఉదయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారులతో కలిసి కోహెడలో పర్యటించారు. మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఫేజ్–1 కింద చేపట్టే నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అతి తర్వలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులతో సమావేశం ఉంటుందని తెలిపారు. సమీక్షలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి
వైస్ -చైర్మన్ భాస్కరాచారి, డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, నవరాజ్, అంజయ్య, మశ్చేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, గణేష్ నాయక్, బండి మధుసూదన్ రావు, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.