
మళయాళంలో లూసీఫర్ సీక్వెల్ గా వచ్చిన ఎల్2: ఎంపురాన్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రిలీజ్ రోజు మంచి డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా తాజాగా రూ.250 కోట్లు (గ్రాస్) మార్క్ ని అందుకుంది. 10 రోజుల్లోనే అత్యంత ఫాస్ట్ గా ఈ ఫీట్ ని అందుకున్న తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చెయ్యడంతోపాటు మలయాళ సినీ ఇండస్ట్రీలోనే రూ.100 కోట్లు షేర్ సాధించిన మొదటి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.
అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని చోట్ల వివాదంగా మారడంతో ప్రసారం నిలిపివేశారు. కానీ కొన్ని సీన్లు రీ ఎడిట్ చేసి సెన్సార్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. అయినప్పటికీ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఈ ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన మార్కో రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసిన సినిమాలో లిస్టులో చేరింది.
ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, డైరెక్టర్ ప్రిథ్విరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టోవినో థామస్, సచిన్ ఖేడ్కర్, అభిమన్యు సింగ్ తదితరులు నటించారు.
కథేంటంటే:
‘లూసిఫర్’ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. పీకే రామదాస్ (సచిన్ ఖేడ్కర్) మరణానంతరం ఐయూఎఫ్ పార్టీలో చెలరేగిన అలజడులన్నింటినీ సద్దుమణిగేలా చేసాక, తన తమ్ముడైన జతిన్ రామ్‌దాస్ ను (టోవినో థామస్) ముఖ్యమంత్రిని చేసి విదేశాలకు లూసిఫర్ స్టీఫెన్ నడింపల్లి (మోహన్‌లాల్) అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అధికారం చేతికొచ్చాక జతిన్ రామ్‌దాస్ తన వక్రబుద్ధిని చూపెడతాడు. సొంత ప్రయోజనాల కోసం దేశ రాజకీయాలను శాసిస్తున్న మతతత్వ వాది బాబా భజరంగి (అభిమన్యు సింగ్)తో కలిసి తాను పనిచేయబోతున్నామని ప్రకటిస్తారు.
►ALSO READ | Vaishnavi Chaithanya: ఆ హీరో నాకు చాలా సపోర్ట్ చేశాడు.. సినిమా సెట్స్ లో అలా చేస్తూ..
జతిన్‌ను అడ్డం పెట్టుకుని కేరళలోని వనరులను భజరంగి కొల్లగొట్టాలనుకుంటాడు. అయితే జతిన్ నిర్ణయాన్ని అక్క ప్రియదర్శి (మంజు వారియర్)తో పాటు పీకేఆర్ పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారు. వాళ్ళు చేపట్టిన అక్రమ పనులను ఆపడానికి సీఎంకి వ్యతిరేకంగా వెళ్తుంది. దీంతో ఆమెని చంపేందుకు జతిన్ ప్రయత్నిస్తాడు. ఇక అక్కడ రాజకీయ అల్లర్లు చెలరేగడం, పార్టీ అస్తవ్యస్తం అవ్వడం మొదలవ్వతుంది.
అప్పుడు రాష్ట్రంలోకి లూసిఫర్ స్టీఫెన్ అడుగెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. స్టీఫెన్ వచ్చాక జతిన్, బాబా భజరంగి అవినీతిని ఎలా అరికట్టాడు? ఐదేళ్లు కేరళ వదిలి విదేశాలకు ఎందుకు వెళ్ళాడు? స్టీఫెన్ గట్టుపల్లి అబ్రహం ఖురేషి ఎలా అయ్యాడు? భజరంగికి జయేద్ మసూద్ (పృథ్విరాజ్ సుకుమార్) మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే ఎల్ 2 ఎంపురాన్ మూవీని థియేటర్లో చూడాల్సిందే.