
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ మార్చ్ 27న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్స్ పై ప్రముఖ సినీ నిర్మాతలు ఆంటోని పెరుంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్, సుభాస్కరన్ అల్లిరాజా తదితరులు కలసి సంయుక్తంగా నిర్మించారు. యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో మౌత్ పబ్లిసిటీ బాగా వచ్చింది. దీంతో రెండో రోజు కలెక్షన్స్ ఫస్ట్ డే కంటే దాదాపుగా 15% శాతం పెరిగాయి.
అయితే ఎల్2: ఎంపురాన్ మలయాళ సినీ ఇండస్ట్రీలో పలు రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులో ముఖ్యంగా చాలా ఫాస్ట్ గా రిలీజ్ అయిన 48 గంటల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే మలయాళ సినీ ఇండస్ట్రీలో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల లిస్టులో 10వ స్థానంలో చేరింది. అయితే ఇప్పటివరకూ భారత్ లో ఎల్2: ఎంపురాన్ రూ.65.75 కోట్లు(నెట్) కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఇదే హవా కొనసాగిస్తూ రూ.40 కోట్లు కలెక్ట్ చేయడంతో రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. అయితే లాంగ్ వీకెండ్ ఉండటం, ఈద్ పండుగ హాలీడేస్ ఉండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా సులభంగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీంతో హీరో మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎల్2: ఎంపురాన్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే మీ ప్రేమ, సపోర్ట్ ఉంటే ఏదైనా సాధ్యమేనంటూ ఎల్2: ఎంపురాన్ మూవీ పోస్టర్ ని షేర్ చేశాడు.
The Cicada himself. #L2E #Empuraan surpasses 100 crore at the box office worldwide in less than 48 hours, setting new benchmarks in cinematic history.
— Mohanlal (@Mohanlal) March 28, 2025
A heartfelt thanks to all of you for being part of this extraordinary success! Your love and support made this possible. pic.twitter.com/SoGeHClLY2
ఎల్2: ఎంపురాన్ స్టోరీ ఏంటంటే:
‘లూసిఫర్’ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. పీకే రామదాస్ (సచిన్ ఖేడ్కర్) మరణానంతరం ఐయూఎఫ్ పార్టీలో చెలరేగిన అలజడులన్నింటినీ సద్దుమణిగేలా చేసాక, తన తమ్ముడైన జతిన్ రామ్‌దాస్ ను (టోవినో థామస్) ముఖ్యమంత్రిని చేసి విదేశాలకు లూసిఫర్ స్టీఫెన్ నడింపల్లి (మోహన్‌లాల్) అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అధికారం చేతికొచ్చాక జతిన్ రామ్‌దాస్ తన వక్రబుద్ధిని చూపెడతాడు. సొంత ప్రయోజనాల కోసం దేశ రాజకీయాలను శాసిస్తున్న మతతత్వ వాది బాబా భజరంగి (అభిమన్యు సింగ్)తో కలిసి తాను పనిచేయబోతున్నామని ప్రకటిస్తారు.
జతిన్‌ను అడ్డం పెట్టుకుని కేరళలోని వనరులను భజరంగి కొల్లగొట్టాలనుకుంటాడు. అయితే జతిన్ నిర్ణయాన్ని అక్క ప్రియదర్శి (మంజు వారియర్)తో పాటు పీకేఆర్ పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారు. వాళ్ళు చేపట్టిన అక్రమ పనులను ఆపడానికి సీఎంకి వ్యతిరేకంగా వెళ్తుంది. దీంతో ఆమెని చంపేందుకు జతిన్ ప్రయత్నిస్తాడు. ఇక అక్కడ రాజకీయ అల్లర్లు చెలరేగడం, పార్టీ అస్తవ్యస్తం అవ్వడం మొదలవ్వతుంది.
అప్పుడు రాష్ట్రంలోకి లూసిఫర్ స్టీఫెన్ అడుగెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. స్టీఫెన్ వచ్చాక జతిన్, బాబా భజరంగి అవినీతిని ఎలా అరికట్టాడు? ఐదేళ్లు కేరళ వదిలి విదేశాలకు ఎందుకు వెళ్ళాడు? స్టీఫెన్ గట్టుపల్లి అబ్రహం ఖురేషి ఎలా అయ్యాడు? భజరంగికి జయేద్ మసూద్ (పృథ్విరాజ్ సుకుమార్) మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే ఎల్ 2 ఎంపురాన్ మూవీని థియేటర్లో చూడాల్సిందే.