![లా సెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్](https://static.v6velugu.com/uploads/2025/02/la-set-eset-exam-schedule-released_a7O4lerqoP.jpg)
హైదరాబాద్, వెలుగు: ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ ఎల్ సెట్ అప్లికేషన్ల ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నది. శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన లాసెట్, పీజీఎల్ సెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 25న ఈ రెండు ఎంట్రెన్స్ టెస్టుల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.కాగా, జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు జరగనున్నాయి.
25న ఈసెట్ నోటిఫికేషన్
బీటెక్, బీఫార్మసీ, బీఈ తదితర కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్ లో చేరేందుకు నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ 25న రిలీజ్ కానున్నది. హైదరాబాద్ లో శనివారం జరిగిన సెట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్ రిలీజ్ చేశారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12న ఈసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.