భద్రాచలం,వెలుగు : నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రోడ్డు ప్రమాదానికి గురై బాధపడుతున్న ఇద్దరు బాధితులకు ప్రథమ చికిత్స అందించి స్థానిక సత్యనారాయణపురం పీహెచ్సీకి తరలించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
చర్ల మండలంలో పర్యటించేందుకు ఎమ్మెల్యే వెంకట్రావు వెళ్తున్నారు. ఇదే సమయంలో సత్యనారాయణపురం శివారున ఛత్తీస్గఢ్ నుంచి బైక్పై వస్తున్న ఇద్దరిని టాటా మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది.దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తన వెహికల్ ఆపి ఎమ్మెల్యే వెంకట్రావు అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేసి గన్మెన్ల సాయంతో అంబులెన్స్ ద్వారా సత్యనారాయణపురం పీహెచ్సీకి తరలించారు. దీనితో వారిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.