సుప్రీం కోర్టులో ఫస్ట్ టైం సినిమా వేస్తున్నారు.. ఇంతకీ ఏంటా సినిమా?

భారత దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఫస్ట్ టైం ఓ సినిమా ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి సంఘటన గతంలో ఎప్పుడు జరగలేదు. సుప్రీం కోర్టు ఏర్పడి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 4గంటలకు లాపతా లేడీస్ అపే మూవీని ఆడించనున్నారు. 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌  డి.వై. చంద్రచూడ్‌ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించనున్నారు. ఈ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ల కూడా రానున్నట్లు సమాచారం. అడ్మినిస్ట్రేషన్‌ భవనంలోని సి-బ్లాక్‌లో గల ఆడిటోరియంలో ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా లింగ వివక్షత నిర్మూలన, స్త్రీల అణిచివేత గురించి మంచి కాంసెప్ట్ తో తెరకెక్కించారు డైరెక్టర్ కిరణ్ రావు.

Also Read:-వయనాడ్ లో భూమి నుంచి భారీ శబ్దాలు.. ఖాళీ చేసి వెళుతున్న జనం

దీనికి నిర్మాత అమీర్ ఖాన్. లాపతా లేడీస్ మంచి సామాజిక కోణంలో తీసిన సినిమా. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.
s