జాబ్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 183, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
అర్హత: ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికెట్ కోర్సు/ ఎంఎల్టీ(ఒకేషనల్)/ ఇంటర్మీడియట్ (ఎంఎల్టీ ఒకేషనల్)/ బీఎస్సీ (ఎంఎల్టీ)/ ఎంఎస్సీ(ఎంఎల్టీ)/ డీఎంఎల్టీ/ బీఎంఎల్టీ/ పీజీడీ ఎంఎల్టీ/ బీఎస్సీ (మైక్రోబయాలజీ)/ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ మెడికల్ బయోకెమిస్ట్రీ/ క్లినికల్ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 21 తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. నవంబరు 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్లైన్ పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్లు ఉంటాయి. పూర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.