
వర్ణవివక్ష..టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా వదలని జబ్బు. కేవలం ఒంటి రంగు కారణంగా ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా సరే చులకనగా చూస్తూ బాధిస్తుంటారు కొందరు. ఒక వ్యక్తి ఎదుగుదలను కూడా తన ఒంటి రంగు శాసిస్తుందనడానికి ఎన్నో సాక్ష్యాలు..ఎంత టాలెంట్ ఉన్నా..కెరీర్ పరంగా అవకాశాలు కోల్పోయిన వారు, జీవిత గమనంలో ఎన్నో అడ్డంకులను, అవమానాలను ఎదుర్కొన్న వారు ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వర్ణవివక్షపై కేరళ సీనియర్ బ్యూరోక్రాట్ పవర్ ఫుల్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడది సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
ALSO READ | Basanagouda Patil: బీజేపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే సస్పెండ్
#WATCH | Thiruvananthapuram: On a comment about her skin complexion, Sarada Muraleedharan, Kerala Chief Secretary, says "...It was a comment that was made perhaps from a sense of humour. But the thing is, behind the humour, there is an entire value connotation and that value… pic.twitter.com/LkL67fr6m0
— ANI (@ANI) March 26, 2025
శారదా మురళీధరన్..కేరళ చీఫ్ సెక్రటరీ..1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్..ఇటీవల ఆమె సోషల్ మీడియాలో రాసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఫేస్ బుక్ లో ఉద్వేగపూరితమై, హృదయ విదారకమైన పోస్ట్ లో వర్ణ వివక్ష.. ఇంటిలో, ఆఫీసుల్లో, ఉద్యోగ నియామకాల్లో, వృత్తిపరమైన అంచనాల్లో వర్ణవివక్ష, లింగ వివక్ష ఎంతటి అసమానతను చూపిస్తుందో హైలైట్ చేసింది. ఈ పోస్టు సమాజంలో పాతుకు పోయిన వర్ణవివక్షపై సామాజిక చర్చకు దారితీసింది.
ALSO READ | మనందరి అక్క.. జీతం మొత్తాన్ని ఖాళీ చేస్తుంది : ఆర్థిక మంత్రి నిర్మలపై కునాల్ మరో సాంగ్
శారదా మురళీధరన్ తన ఒంటి రంగుపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ పై స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలు తిప్పికొట్టాయనే కంటే ఆలోచింపజేశాయని చెప్పొచ్చు.నల్లదనానికి ఉన్న ప్రాధాన్యతను చక్కగా వివరించారు. ఇంకొకరు నలుపుపై విమర్శలు, హేళన చేయకుండా ఈ పోస్టులో గట్టిగా సమాధానమిచ్చారు.
1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శారద మురళీధరన్ ఆమె ప్రస్తుతం కేరళలో చీఫ్ సెక్రటరీగా విధుల్లో ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరూ ఆమె పనితీరుని భర్త (మాజీ కేరళ ప్రధాన కార్యదర్శి వి వేణు) రంగుతో పోలుస్తూ..‘‘ఆమె భర్త ఒంటి రంగు తెలుపులా నల్లగా ఉందని’’ వెటకారంగా పోస్టులు పెట్టారు. ఆమె వాటిని చూసి వెంటనే ఆ పోస్టులని డిలీట్ చేసేశారు. అయితే కొందరూ శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు దీనిపై మాట్లాడుతున్నా అంటూ ఆ పోస్టులను రీ పోస్ట్ చేశారు.
ALSO READ| అలహాబాద్ హైకోర్టు తీర్పుపై షాకైన సుప్రీం.. ‘అమానవీయం’ అని వ్యాఖ్య
నలుపు అంటే ఎందుకు అంత ద్వేషం..నలుపు విశ్వవ్యాప్త సత్యం.. దేనినైనా గ్రహంచగలదు, మానవాళికి అత్యంత శక్తివంతమైన పల్స్. ఇది ప్రతిఒక్కరిపై పనిచేస్తుంది. వర్షానికి సూచిక.. నలుపు అందంగా ఉంటుంది. ఇది అత్యంత పవర్ ఫుల్ కలర్. ఏ రంగునైనా తనలో ఇముడ్చుకోగలదు. ఆఖరికి కంటి పాపకూడా నలుపు ఉంటుంది. అలాంటి నలుపైపై ఎందుకింత చులకనభావం అని ఆమె నిలదీశారు.
ఇక శారదా మురళీధరన్ పోస్టుపై కేరళరాజకీయ నేతలు స్పందించారు. ‘‘సీనియర్ బ్యూరోక్రాట్ శారదామురళీధరన్ పోస్టులో రాసిన ప్రతి మాట ఆలోచింపజేసింది. మనుసుకు హత్తుకునేలా ఉంది.’’ అని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అన్నారు. తన తల్లి కూడా నలుపురంగులోనే ఉందని ఇది చర్చకు రావాలని కోరుకున్నా అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
శారద మురళీధరన్ గతేడాది ఆగస్టు 31న కేరళ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. తన భర్త మాజీ కేరళ చీఫ్ సెక్రటరీ వేణు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలోకి వచ్చారు. అప్పట్లో ఆమె నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కేరళ చరిత్రలోనే తొలిసారిగా భర్త నుంచి ఆమె ఛీప్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకారించారామె. ఇక ఆమె గతంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ రూరల్ లైవ్లిహుడ్స్ మిషన్‌లో సీఓఓగా, కుటుంబంశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.