లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇప్పిస్తామంటూ..వసూళ్ల దందా

లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇప్పిస్తామంటూ..వసూళ్ల దందా
  •     ఒక్కో వ్యక్తి వద్ద రూ. 1000 నుంచి రూ. 1500 వసూలు చేస్తున్న పైరవీకారులు
  •     డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైతం ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో వసూళ్లు
  •     గద్వాల లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డాగా చేసుకోవడంతో పాటు గ్రామాల్లోనూ తిరుగుతున్న అక్రమార్కులు
  •     ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదంటున్న ప్రజలు

గద్వాల, వెలుగు : భవన నిర్మాణంతో పాటు ఇతర అసంఘటితరంగంలో పని చేసే కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కొందరు వ్యక్తులు పైరవీకారుల అవతారం ఎత్తి అర్హత లేని వారికి కూడా కార్డులు ఇప్పిస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే అడ్డాగా మార్చుకోవడంతో పాటు ఏకంగా గ్రామాల్లో తిరుగుతూ ఒక్కొక్కరి వద్ద రూ. 1000 నుంచి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నారు. మరో వైపు కార్డు ఉన్న వారు చనిపోతే డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైతం ఇప్పిస్తామంటూ భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

50 మందికి పైగానే పైరవీకారులు

గద్వాల లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50 మందికిపైగానే పైరవీకారులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరైనా లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు కోసం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చారంటే చాలు.. వారికి మాయమాటలు చెప్పి తమ బుట్టలో వేసుకుంటారు. ఎలాంటి వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా ఈజీగా కార్డు ఇప్పిస్తామంటూ నమ్మించి అందినకాడికి దోచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గట్టు మండలం చింతలకుంటకు చెందిన ఓ వ్యక్తి ప్రతిరోజు లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దే మకాం వేస్తూ జోరుగా పైరవీలు చేస్తున్నాడని, ధరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం గడ్డందొడ్డి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇలా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పైరవీకారులు కార్డులు మాత్రం ఇప్పించడం లేదు. సుమారు 100 మంది వద్ద డబ్బులు వసూలు చేస్తే 10 మందికే కార్డులు ఇప్పిస్తూ మిగతా వారికి ‘ఇప్పుడు.. అప్పుడు.. పోస్టులో వస్తాయి’ అనే సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు. మరో వైపు డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద రూ. 30 నుంచి రూ. 50 వేలు, పిల్లల చదువు కోసం వచ్చే డబ్బు ఇప్పించేందుకు సైతం రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి వసూలు చేస్తున్నారని పలువురు అంటున్నారు. పైరవీకారులు వసూలు చేసిన డబ్బులో కొంత ఆఫీసర్లకు సైతం వెళ్తుందని, వారికి నెల నెలా పార్టీలు సైతం ఇస్తుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లపైనా అనుమానాలు

లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల పేరున జరుగుతున్న దందాలో ఆ శాఖ ఆఫీసర్లపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆఫీసర్లే పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యక్తులను నియమించుకొని వారి ద్వారా డబ్బులు వస్తూ, వారు చెప్పిన వారికే లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు మంజూరు చేయడంతో పాటు ఇతర బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చేలా సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్నేండ్ల నుంచి ఇక్కడే పాతుకుపోయిన ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా కట్టిన కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లకుండా గతంలో ఉన్న పాత ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కార్యకలాపాలు కొనసాగించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఫిష్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే వసూళ్ల దందాకు ఇబ్బందులు ఏర్పడుతాయన్న ఆలోచనతోనే అక్కడికి వెళ్లడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

గద్వాల జిల్లా ధరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం గుడ్డెందొడ్డి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత నెలలో ఓ మహిళను తీసుకొని ఓబులోనిపల్లి గ్రామానికి వెళ్లాడు. మహిళను లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిచయం చేశాడు. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులతో మాట్లాడి వారికి లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. వారి ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు, ఇతర సర్టిఫికెట్లతో పాటు ఒక్కొక్కరి వద్ద రూ. 1000 చొప్పున మొత్తం రూ. 40 వేలు వసూలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎన్ని రోజులైనా కార్డులు ఇప్పించకపోవడంతో తమ డబ్బులు, ఇతర పేపర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని అడిగిన గ్రామస్తులను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అక్రమదందా వ్యవహారం బయటపడింది.

పైరవీకారులను ఆశ్రయించొద్దు

లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు, ఇతర బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ప్రజలు ఎవరూ పైరవీకారులను ఆశ్రయించొద్దు. కొందరు వ్యక్తులు కార్డులు ఇప్పిస్తామంటూ డబ్బు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి కూడా వచ్చింది. ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం. అనర్హులకు కార్డులు మంజూరు అయితే వాటిని తొలగిస్తాం. కార్డులు కావాల్సిన వారు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చి అప్లై చేసుకోవాలి.

- వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లేబర్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గద్వాల