తెలంగాణ ప్రఖ్యాత పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి భక్తులు తరలివస్తున్నారు. జులై 17న కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్.. స్వామి వారిని దర్శించుకున్నారు.
అంతకు ముందు విదేశీ ప్రజాప్రతినిధుల బృందానికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వర్షం కారణంగా ప్రధానాలయంలో నిత్య కల్యాణం..
యాదాద్రిలో వర్షాల కారణంగా నిత్య కల్యాణ మండపంలో వర్షపు నీరు చేరుకున్నాయి. దీంతో స్వామి వారి ప్రధానాలయంలో నిత్య కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిమిత సభ్యులతో స్వామి కల్యాణం జరిపించడంపై మిగతా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.