
మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం వజినేపల్లిలో ఆదివారం డెంగ్యూ ట్రీట్‌మెంట్ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వజినేపల్లికి చెందిన అనపర్తి శ్రీనివాస్ (38) వ్యవసాయ కూలీ. ఇతడు కొన్ని రోజుల కింద డెంగ్యూ బారిన పడ్డాడు. ట్రీట్‌మెంట్ కోసం రూ.లక్ష వరకు అప్పు చేశాడు. తీర్చలేక శనివారం రాత్రి గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు.