ఖని లో కూలీల మృతి.. కల్లు డిపో సొసైటీ అధ్యక్షుడి అరెస్ట్

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని ఇందిరా నగర్‌‌‌‌ కల్లు డిపో సమీపంలో బుధవారం చనిపోయిన ఇద్దరు కూలీల కేసులో కల్లు డిపో సొసైటీ ప్రెసిడెంట్‌‌‌‌ వంగ శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ను వన్‌‌‌‌ టౌన్‌‌‌‌ పోలీ సులు అరెస్ట్‌‌‌‌ చేశారు. ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని సీఐ ప్రమోద్‌‌‌‌రావు తెలిపారు. కాగా, పర్యవేక్షించకుండా నిర్లక్ష్యం వహించిన ఆఫీసర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ లీడర్‌‌‌‌ కందుల సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం ఆమె మృతుడు రమేశ్‌‌‌‌ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు.

కల్తీ కల్లును నియంత్రించలేని ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయా లని, కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలిపిన సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్‌‌‌‌ జిల్లా ప్రధాన కార్యదర్శి  మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖని మెయిన్‌‌‌‌ చౌరస్తాలో ప్లకార్డులతో వారు నిరసన తెలిపారు. లీడర్లు సాదుల శివ, ఆసాల నవీన్‌‌‌‌, రేణికుంట్ల ప్రీతం, రణవేణి సుధీర్‌‌‌‌ కుమార్‌‌‌‌, డబ్బెట గోపీకృష్ణ పాల్గొన్నారు.