వ్యవసాయ కూలీల ధర్నా

 వ్యవసాయ కూలీల ధర్నా

పినపాక, వెలుగు: పినపాక మండలంలో మిరప కోత కూలీలకు ఇచ్చే రేట్లను తగ్గించడంపై నిరసనగా  వివిధ గ్రామాలకు చెందిన కూలీలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఏడూళ్లబయ్యారం క్రాస్​ రోడ్​లో బైఠాయించి పలుగ్రామాల నుంచి మిరపకోతలకు వెళ్తున్న కూలీల వాహనాలు అడ్డగించి తిరిగి వెనక్కి పంపించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి వరకు రూ.300 చెల్లించిన కూలిని రూ.250కి తగ్గించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న కూలీలను కాదని వేరే ప్రాంతాలను కూలీలను తీసుకొచ్చి పనిచేయించుకోడం తగదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ పినపాక తహసీల్దార్​​ఆఫీసులో వినతి అందజేశారు. కూలీలకు నిరసనకు సీపీఐ(ఎంఎల్​) మాస్​లైన్​ ప్రజాపంథా జిల్లా నాయకులు ఆర్.మధుసూధనరెడ్డి మద్దతు తెలిపారు.