
గోదావరిఖని, వెలుగు : తెలంగాణలోని బొగ్గు గనుల ఓపెన్ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని ఆర్జీ 1 జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక కన్వీనర్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి దక్కాల్సిన బొగ్గు గనులను వేలం పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఈ వేలాన్ని సింగరేణిలో పనిచేసే ప్రతి కార్మికుడు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్జీ 1 జీఎంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కామెర గట్టయ్య, మిట్టపల్లి కుమారస్వామి, నరేశ్, జి.రాములు, నీరటి రాజన్న, దేవీసత్యం, ఎంఎఫ్ బేగ్, యుగేందర్, రాయపోచం పాల్గొన్నారు.