
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని ఖమ్మం-సూర్యాపేట రాష్ట్ర రహదారిపై ఉన్న పాలేరు పార్కులో కనీస సదుపాయాలు కరువయ్యాయి. 2005 నవంబర్ 26న అప్పటి కేంద్ర పర్యటక శాఖ మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో పాలేరు టు పర్ణశాల వరకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచారు. ఆనాడు ఐదుగురు ప్రయాణించే బోటు, కాలుతో తొక్కే నలుగురు తిరిగే బోటు, 30 మందితో ప్రయాణించే మరో బోటును 2017 లో అప్పటి మంత్రి తుమ్మలనాగేశ్వరరావు ప్రారంభించారు.
ఫౌంటెన్లు, ఫుడ్ కోర్టు, పిల్లల పార్కును ఏర్పాటు చేశారు. కానీ పర్యవేక్షణ కరువై కళాహీనంగా తయారయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పార్కును అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని పర్యాటక ప్రేమికులు, పాలేరు ప్రజలు కోరుతున్నారు.