Health tips:తరుచుగా అలసట,బలహీనతతో బాధపడుతున్నారా?.. అయితే C విటమిన్ లోపమే..అధిగమించాలంటే ఇవి తినండి

Health tips:తరుచుగా అలసట,బలహీనతతో బాధపడుతున్నారా?.. అయితే C విటమిన్ లోపమే..అధిగమించాలంటే ఇవి తినండి

ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు చాలా ముఖ్యం..ఇవి శరీరానికి శక్తి, ఆరోగ్యాన్నిస్తాయి.ఏదైనా ఒక విటమిన్ లోపం ఉండే అది శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.విటమిన్లలో C విటమిన్ చాలా కీలకమైనది. అటువంటి సి విటమిన్ లోపిస్తే. శరీరం త్వరగా అలసిపోవడం, బలహీనత ఏర్పడుతుంది. మరి విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది? వంటి విషయాలను తెలుసుకుందాం. 

సి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగకారకాలతో పోరాడేందుకు శక్తినిస్తుంది. సి విటమిన్ లోపిస్తే రోగనిరోధక శక్తి తగ్గడం, వ్యాధులకు నిలయంగా మారుతుంది. త్వరగా అనారోగ్యానికి గురవుతారు. చిన్న జలుబు కూడా శరీరంపై దాని ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. ముఖంపై అకాల వృద్ధాప్య గుర్తులు వస్తాయి. విటమిన్ సి లోపం నోటి ఆరోగ్యాన్ని అంటే దంతాలు, చిగుళ్ళపై కూడా ప్రభావం చూపుతుంది.  శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే మొత్తం శరీర నిర్మాణం క్షీణిస్తుంది. విటమిన్ సి పొందాలంటే ఆహారంలో కొన్ని ప్రత్యేక ఆహారాలను చేర్చుకోవాలి. ఇది శరీరానికి రోజువారీ విటమిన్ సి అవసరాలను తీర్చడాన్ని సులభతరం చేస్తుంది. రోజువారీ విటమిన్ సి అవసరాలను తీర్చగల అనేక ఆహార పదార్థాలు ,పానీయాలు ఉన్నాయి. వాటి గురించి..

విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు

ఆమ్లా(ఉసిరికాయ): ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతి రోజూ ఏ రూపంలో అయినా ఒక ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. మీడియం సైజు ఉసిరికాయ తినడం వల్ల శరీరానికి 600 నుంచి 700 మి.గ్రాముల విటమిన్  సి లభిస్తుంది. ప్రతిరోజూ ఆమ్లా రసం, ఆమ్లా పొడి, ఆమ్లా ఊరగాయ లేదా ఆమ్లా చట్నీ తినవచ్చు.

జామ: చాలా మంది విటమిన్ సి పుల్లని పదార్థాలలో మాత్రమే అత్యధికంగా లభిస్తుందని అనుకుంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. పండ్లలో జామలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. రోజూ మిడిల్ సైజ్ జామ తినడం వల్ల దాదాపు 228 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. కాబట్టి డైలీ ఆహారంలో జామను ఖచ్చితంగా తినండి. 

కివి: విటమిన్ సి లోపాన్ని రోజూ కివి తినడం ద్వారా కూడా అధిగమించవచ్చు. రోజూ 1 కివి తినండి.1 కివిలో దాదాపు 92 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. దీంతో రోజువారీ అవసరాలను కావాల్సిన సి విటమిన్ పొందవచ్చు. 

బొప్పాయి: కప్పు బొప్పాయి తినడం ద్వారా శరీరానికి 88 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. కాబట్టి బొప్పాయిని రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. వేసవిలో కడుపు ఆరోగ్యంగా ఉండటంలో బొప్పాయి సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన ఇతర విటమిన్లను కూడా అందిస్తుంది. బొప్పాయి తినడం ద్వారా విటమిన్ సి లోపాన్ని అధిగమించవచ్చు.

►ALSO READ | ఎండలకు మొఖం మాడిపోయిందా..? ఈ ఏడు పండ్లు తింటే దగదగా మెరిసిపోవాల్సిందే..!

నారింజ,నిమ్మకాయలు: నారింజ సీజనల్ గా దొరికే పండ్లు. నిమ్మకాయలు కూడా విటమిన్ సికి మంచి వనరులు. సిట్రస్ పండ్లలో విటమిన్ సి కనిపిస్తుంది. రోజుకు ఒక మీడియం నారింజ తినడం వల్ల శరీరానికి 70 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. నారింజ రసం కూడా తాగవచ్చు.100 గ్రాముల నిమ్మకాయ తినడం వల్ల శరీరానికి 50నుంచి 60 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది.

కాబట్టి విటమిన్ సి లోపం ఉన్నవారు తప్పకుండా మీ డైలీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోండి. విటమిన్ సి పొందండి.. ఆరోగ్యంగా ఉండొచ్చు.