
- మంజీరా బ్యారేజీలో అడుగంటిన నీరు
- ఉత్పత్తి కేంద్రానికి బోరునీటి సరఫరా
మంజీరా రిజర్వాయర్ పూర్తిగా అడుగంటడంతోమొసళ్లు నీళ్లు లేక ఊళ్లలోకి వస్తు న్నాయి. కొన్నిఅక్కడే చిన్న చిన్న మడుగుల్లో తల దాచుకుంటున్నాయి. మొసళ్ల ఉత్పత్తి కేంద్రంలోని కొలనులో బోరు నీళ్లు నింపి వాటిని కాపాడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో మంజీరా బ్యారేజీ దగ్గర మొసళ్ల ఉత్పత్తి కేంద్రముంది. రెండు టీఎంసీల నీటి సామర్థ్యమున్న మంజీర బ్యారేజీ ప్రస్తుతం పూర్తిగా అడుగంటిపోయిం ది. అక్కడకక్కడ లోతైన మడుగుల్లోనే నీళ్లు కనిపిస్తు న్నాయి. వర్షభావం వల్ల రెండేళ్ల నుంచి ఎగువ ప్రాంతం నుంచి బ్యారేజీలోకి నీళ్లు రావడం లేదు. నీటి కొరత మొసళ్ల మనుగడ మీద ప్రభావంచూపుతోం ది. 2016 లెక్కల ప్రకారం 600 మొసళ్లుం డగా.. ఇప్పుడు అందులో సగం కూడా లేవని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బయటెక్కడ మొసళ్లు కనిపించినా పట్టుకొచ్చి మంజీరలో వదులుతారు.
ఉత్పత్తి కేంద్రానికి బోరు నీళ్లు
కలబ్ ర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మంజీరప్రాజెక్టు పక్కన మంజీర వన్య ప్రాణి అభయారణ్యకేంద్రం ఉంది. ఇక్కడే మొసళ్ళ సంతానోత్పత్తికేంద్రాన్ని నిర్వహిస్తు న్నారు. సంతానోత్పత్తి కోసం ఇక్కడ ఒక ఆడ మొసలి, రెండు మగ మొసళ్ళను ఉంచుతారు. వీటికి గొడ్డు మాంసం ఆహారంగా ఇస్తారు. ఆడ మొసళి మట్టిలో, ఇసుకలో గూడుసిద్దం చేసుకొని 25 నుంచి 30 గుడ్లు పెడుతుంది. నిర్వాహకులు ఈ గుడ్లకు రక్షణ కల్పిస్తారు. పిల్లలు పుట్టిన తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో కొంత కాలం పెంచి మంజీర రిజర్వాయర్‌లోకి వదులుతారు. మొసళ్ల పెంపకం కోసం ఏర్పాటు చేసిన కొలనులో బోరు నీటిని వదిలి పరిరక్షిస్తారు. మొసళ్ల గుర్తింపు కోసం జరగాల్సిన సెన్సెస్ నీటి కొరత కారణంగా నిలిచిపోయిం ది.
ఊళ్లలోకొస్తున్నాయ్
మంజీర బ్యారేజీ అడుగంటిపోవడంతో అక్కడున్నమొసళ్లు ఊళ్లలోకి వస్తున్నాయి. ఇటీవల పుల్ కల్ మండలం పెద్దరెడ్డిపేట మిషన్ భగీరథ సంప్‍హౌస్‍లో ఓ మొసలి తలదాచుకోగా పట్టుకొని మడుగుల్లో వదిలారు. రాయికోడ్ మండలం షాపూర్, ఖాన్ జమల్‌పూర్ తదితర గ్రామాల్లో మొసళ్లు పొలాల్లోకి వచ్చాయి. మడుగుల దగ్గర కాలువలు తీస్తే ఆ నీరు కూడా లేక మొసళ్ల మనుగడ దెబ్బతింటుందని భావించి రెండేళ్లుగా కాలువల తవ్వకాలను అధికారులు నిషేధించారు.
ఉత్పత్తికి నష్టం లేదు
మొసళ్ల ఉత్పత్తికి నష్టమేమీలేదు. రిజర్వాయర్ లో నీరు అడుగంటినా ఉత్పత్తి కేంద్రంలో మొసళ్ల పిల్లలను కాపాడుతున్నాం. పెంపకానికి మాత్రం నీటి కొరత లేదు. వీటి కోసమే ప్రత్యేకంగా ఓ బోరు వేయించి రోజు నీరు నిల్వ చేస్తున్నాం.- రాములు , బీట్‍ఆఫీసర్