హిమాలయ పర్వత ప్రాంతాల్లో సాధారణ జనవజీవనం చాలా కష్టం. గడ్డకట్టించే శీతల వాతావరణంలో బతకడం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఫుట్ బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఆశ్చర్య పడాల్సిందే. లడఖ్ లోని స్పిటుక్ దగ్గర అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫుట్ బాల్ మైదానాన్ని నిర్మించారు. ఇది భారత్ లోనే అత్యంత ఎత్తైన సాకర్ మైదానం. ఈ స్టేడియం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు.
ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్టేడియం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. 30 వేల మంది ప్రేక్షకుల కూర్చునేలా గ్యాలరీలు నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం అంచనా వ్యయం రూ.10.68 కోట్లు. అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం ఫిఫా కూడా లడఖ్ ఫుట్ బాల్ గ్రౌండ్ కు గ్రీన్ సిగ్నలిచ్చింది. ఖేలో ఇండియా కార్యాచరణలో భాగంగా మైదానం ఉపరితలాన్ని ఆస్ట్రోటర్ఫ్ తో ఏర్పాటు చేశారు. అంతేకాదు.. స్టేడియాన్ని ట్రాక్ ఈవెంట్ల కోసం ఉపయోగించుకునేందుకు వీలుగా 8 లేన్లతో సింథటిక్ ట్రాక్ లను కూడా పొందుపరిచారు.
Highest Football Stadium:
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) February 9, 2022
Ladakh gets its first football and track & field stadium at a height of over 10,000 feet. @IndiaSports @ianuragthakur pic.twitter.com/lV8ikF66UK
మరిన్ని వార్తల కోసం...