మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్..

మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్..

గత ఏడాది యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మ్యాడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రంలో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించగా గౌరీ ప్రియ, అనంతిక, గోపిక ఉదయన్ హీరోయిన్లుగా నటించారు. 

కాలేజ్ లైఫ్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇటు కామెడీపరంగా అటు మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను బాగానే అలరించిందని చెప్పవచ్చు. దీంతో చిత్ర యూనిట్ మ్యాడ్ సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఈ మ్యాడ్ చిత్ర సీక్వెల్ కి మ్యాడ్ స్కోయర్ అని టైటిల్ ని ఖరారు. 

కాగా ఇటీవలే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ "లడ్డుగాని పెళ్లి" పాట ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు అలాగే ప్రముఖ సింగర్ మంగ్లీతో కలసి ఈ థీమ్ సాంగ్ ని పాడారు. 

ఈ విషయాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే ఈ పాటలో మ్యాడ్ చిత్రంలో నటించిన ముగ్గురు హీరోలు తప్ప హీరోయిన్లు కనిపించలేదు.

ఈ విషయం ఇలా ఉండగా మ్యాడ్ చిత్రంలో హీరోగా నటించి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ విభాగంలో సంతోష్ శోభన్ మరియు సపోర్టింగ్ రోల్ లో నటించిన విష్ణు తదితరులకు సైమా అవార్డులు లభించాయి.