లేడీ అఘోరీ అలియాస్​ శ్రీనివాస్​ నాభర్త.. కరీంనగర్​ యువతి మహిళా కమిషన్​ కు ఫిర్యాదు

లేడీ అఘోరీ అలియాస్​ శ్రీనివాస్​ నాభర్త.. కరీంనగర్​ యువతి మహిళా కమిషన్​ కు ఫిర్యాదు

నిత్యం వార్తల్లో నిలుస్తున్న అఘోరీ ( అఘోరా) ఇప్పుడు శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతొ... అఘోరీ తన భర్త అంటూ మరో స్త్రీ బయటకు వచ్చి అందరి షాక్​కు గురి చేసింది.  లేడీ అఘోరీ అలియాస్​ శ్రీనివాస్​ పై ఓ మహిళరాణిగంజ్​ బుద్దభవన్​ లో మహిళా కమిషన్​కు ఫిర్యాదు చేసింది.  కరీంనగర్​ కు చెందిన రాధిక అనే అమ్మాయిని అఘోరీ గతంలో  పెళ్లి చేసుకున్నాడని  మహిళా కమిషన్​ కు ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలికి అండగా ఉంటామని స్వామి జీ శివ రుద్ర,అడ్వకేట్..ఆజాద్ తెలిపారు. 

గతంతో తనతో శారీరక సంబంధం పెట్టుకొని మహిళా అఘోరీగా మారిన శ్రీనివాస్ వదిలేసి.. ఇప్పుడు మరో మహిళ జీవితాన్ని నాశనం చేసేందుకు వడిగట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  వర్షిణి  అనే మహిళను అఘోరా పెళ్లి చేసుకుకున్నారంటూ.. .అమాయక మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అఘోరీపై చర్యలు తీసుకోవాలని కోరారు.తన కుమార్తెకు మాయమాటలు చెప్పిన అఘోరీ పెళ్లి చేసుకుందని వర్షిణి తండ్రి.. సోదరులు మహిళా కమిషన్​కు తెలిపారు.  

Also Read :- నల్లాలకు మోటార్లు బిగిస్తే జరిమానా 

తనతో జరిగిన పెళ్లి విషయం.. శారీరక సంబంధం గురించి బయటకు చెబితే చంపుతాను అంటూ అగోరా బెదిరించారని రాధిక చెబుతుంది.  అంతేకాకుండాతన దగ్గర  డబ్బులు తీసుకుని.. మానసికంగా హింసించారని పేర్కొంది. తనకు మాదిరిగానే చాలా మంది బాధిత మహిళలు ఉన్నారని.. వారు కూడా బయటకు  వచ్చి ఫిర్యాదు చేయాలని అఘోరీ బాధితులకు రాధిక సూచించారు. మరి సనాతన ధర్మం పరిరక్షణే  ధ్యేయమంటూ సమాజంలోకి వచ్చిన లేడీ అఘోరీ కథ ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి..