వరంగల్: నాగ సాధు అఘోరి గురించి తెలిసే ఉంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో నాగ సాధు అఘోరి ఆలయాల సందర్శనకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఆలయాలకు నాగ సాధు అఘోరి వెళ్లడం, వస్త్రాలు లేకుండా అనుమతించేది లేదని ఆలయ సిబ్బంది తేల్చి చెప్పడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం.
ఇవాళ వరంగల్లోని భద్రకాళి ఆలయంలో కూడా సేమ్ సీన్ రిపీటైంది. వరంగల్ భద్రకాళి ఆలయానికి నాగ సాధు అఘోరి వెళ్లింది. ఆలయం వద్ద అఘోరిని దేవాలయ సిబ్బంది అడ్డుకున్నారు. వస్త్రాలు లేకుండా అనుమతించేది లేదని ఆలయ సిబ్బంది తేల్చి చెప్పారు. అఘోరిని చీర కట్టుకొని లోపలికి రావాలని భక్తులు కూడా కోరారు. దీంతో.. భక్తుల కోరిక మేరకు చీర కట్టుకొని అమ్మవారి దర్శనానికి ఆలయంలోకి నాగ సాధు అఘోరి వెళ్లింది.
ALSO READ | కేటీఆర్.. ఇకనైనా చేసిన తప్పులు ఒప్పుకుని సరెండర్ అవ్వు: MLA వీరేశం
దేశంలో హిందువులంతా ఒకటవ్వాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని నాగ సాధు పిలుపునిచ్చింది. అఘోరాలుగా మారిన వారి పూజా విధానాన్ని, వారి సిద్ధాంతాలని ఎవరికీ చెప్పం అని నాగసాధు చెప్పింది. ‘అందరం కలిసికట్టుగా ఉందాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, గోవు హత్యలను ఆపుదాం, మన ఆడపిల్లల్ని మనమే రక్షించుకుందాం’ అంటూ నాగ సాధు అఘోరి సందేశం ఇచ్చింది. నాగ సాధు అఘోరి భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంది.