ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి పండగ సంబరాలకి పెట్టింది పేరు. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందాలు, కేసినోలు, జూదం వంటివి జోరుగా నిర్వహించారు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు, వీడియొలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మురముళ్ళ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లో దాదాపు 450కి పైగా బరుల్లో కోడి పందాలు నిర్వహించగా పెద్ద కోడిపందాల బరుల్లో 25 లక్షల పైనే ఒక్కో పందెం నడిచినట్లు సమాచారం. అయితే ఈ కోడి పందాలు ఆడేందుకు వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తదితరులు ఎక్కువగా ఆసక్తి చూపారు.
ALSO READ | పండగపూట గోదావరి జిల్లాలో విచ్చలవిడిగా కేసినోల నిర్వహణ..