పెండ్లి కుదరడం లేదని.. లేడీ కానిస్టేబుల్ సూసైడ్.. జనగామ జిల్లా నీలిబండ తండాలో విషాదం

పెండ్లి కుదరడం లేదని.. లేడీ కానిస్టేబుల్ సూసైడ్.. జనగామ జిల్లా నీలిబండ తండాలో విషాదం

పాలకుర్తి ( కొడకండ్ల ), వెలుగు: పెండ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపంతో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో జరిగింది.  కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన గుగులోతు లీల (26) వరంగల్​కమిషనరేట్​హెడ్​క్వార్టర్స్​లో ఏఆర్​ కానిస్టేబుల్‌‌. ఆమెకు ఇటీవల కుటుంబసభ్యులు పెండ్లి సంబంధాలు చూస్తుండగా రిజెక్ట్​ అవుతున్నాయి.  

దీంతో మనస్తాపానికి గురైన లీల ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చింత రాజు తెలిపారు.