హైదరాబాద్‎లో మహిళా కానిస్టేబుల్‎ను.. కారుతో గుద్ది.. నరికి చంపారు

హైదరాబాద్ సిటీలో అత్యంత ఘోర ఘటన.. అందరూ షాక్ అయ్యారు.. మహిళా కానిస్టేబుల్‎ను.. నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా.. కత్తులతో నరికి చంపారు.. బైక్‎పై వెళుతున్న మహిళా కానిస్టేబుల్‎ను కారుతో గుద్దారు.. కింద పడిన తర్వాత.. ఆమెను కత్తులతో నరికి చంపారు.. నడిరోడ్డుపై.. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇంతకీ ఈ మహిళా కానిస్టేబుల్‎‎ను ఎందుకు చంపారో తెలుసా.. ఆమె కులాంతర వివాహం చేసుకోవటమే అనే ప్రచారం కూడా జరుగుతుంది.. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగమణి అనే మహిళా హైదరాబాద్‎లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‎లో కానిస్టేబుల్‎గా విధులు నిర్వర్తిస్తోంది. 

రోజు వారి విధుల్లో భాగంగా 2024, డిసెంబర్ 2వ తేదీ సోమవారం ఉదయం.. పోలీస్ స్టేషన్‎కు వెళ్తుంది కానిస్టేబుల్ నాగమణి. రాయపోలు నుంచి ఎండ్లగూడ రహదారిపై తన బైక్ పై వెళుతున్న సమయంలో.. ఆమెను వెనక నుంచి కారుతో ఢీకొట్టారు దుండగులు. కారు వేగంగా ఢీకొట్టటంతో.. ఆమె ఎగిరి రోడ్డుపై పడింది. ఆ వెంటనే.. కారులో నుంచి బయటకు వచ్చిన కిరాతకులు.. ఆమెను కత్తులతో పొడిచారు. నాగమణి శరీరంపై తీవ్రమైన ఐదు కత్తిపోట్లు ఉండటంతో.. ఆమె రోడ్డుపై ప్రాణాలు విడిచింది. 

Also Read :- పెళ్లైన ఏడాదికే నటి శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..?

కానిస్టేబుల్ నాగమణికి15 రోజుల క్రితమే పెళ్లయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఈ పెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ఇంట్లో వాళ్లను ఎదిరించి.. తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకున్నది కానిస్టేబుల్ నాగమణి. అప్పటి నుంచి ఇంట్లో వాళ్లతో ఆమెకు గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ పెళ్లి కూడా కులాంతర వివాహం కావటం విశేషం. కానిస్టేబుల్ నాగమణి స్వగ్రామం ఇబ్రహీంపట్నం మన్నెగూడ. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తుంది. మన్నెగూడ నుంచి ఇబ్రహీంపట్నం వెళుతున్న సమయంలోనే ఆమెను వెంటాడి.. వేటాడి నరికి చంపారు. కానిస్టేబుల్ నాగామణిని చంపింది ఆమె తమ్ముడే అనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని ఇంకా నిర్థారించలేదు పోలీసులు. హత్య కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు పోలీసులు.