సికింద్రాబాద్ పబ్లిక్ బాత్ రూమ్ లో… గుర్తు తెలియని మహిళ మృతదేహం

సికింద్రాబాద్ పబ్లిక్ బాత్ రూమ్ లో… గుర్తు తెలియని మహిళ మృతదేహం

సికింద్రాబాద్: మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రోడ్ పై ఉన్న పబ్లిక్ బాత్ రూమ్ లో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటిరిగా ఉండడం చూసి అత్యాచారం చేసి హత్య చేసి వుంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగులతో  పెనుగులాటల్లో మహిళ తీవ్రంగా ప్రతిఘటించడం వల్లే చంపి పరారైనట్లు అనుమానిస్తున్నారు. ఇంతకూ ఈ మహిళ ఎవరు? ఎక్కడి నుండి ఇక్కడకు వచ్చింది..?  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మహిళ మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.