బ్రెడ్ ముక్కను ఎలా తింటారు. కొందరు బ్రెడ్ ను కాల్చి..దానిపై సాస్ లేదా..నెయ్యి వేసుకుని తింటారు. మరికొందరు చోలే లేదా సబ్జీతో తింటారు. కానీ మీరు ఎప్పుడైనా బ్రెడ్‌ని సముద్రం నీటిలో ముంచి తిన్నారా..? బ్రెడ్ ను నీటిలో ముంచి తినడమా..? యాక్..అని అనుకుంటున్నారా...? కానీ ఇక్కడ ఓ మహిళ ..తాను బ్రెడ్ తినేందుకు దాన్ని సముద్రం నీటిలో ముంచి తిన్నది. వివరాల్లోకి వెళ్తే..
- ALSO READ | మ్యాగీతో చాలా భయంకరమైన వంటకం.. ఊహించటమే కష్టమే
ఓ మహిళ ఇటలీలో సముద్రంలో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ఆమెకు ఆకలి వేసింది. పడవలో తన వంట గదిలో నుంచి ఓ బ్రెడ్ ముక్కను తీసుకుంది. ఆ బ్రెడ్ ను తినే ముందకు సముద్రం నీటిలో ముంచింది. ఆ తర్వాత దానిపై టమాటా ముక్కలు వేసుకుంది. జున్ను ముక్కను తీసుకుంది. చివరకు ఆ జున్ను ముక్కను కూడా సముద్రం నీటిలో ముంచి..బ్రెడ్ తిన్నాక..జున్నును కూడా తినేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
సముద్రపు నీటిలో ఓ మహిళ బ్రెడ్‌ను ముంచుతున్న వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది అసహ్యంగా ఉందని తెలిపారు. ఈ వీడియో వికారంగా ఉందని కామెంట్ చేశారు.