ఇదేం పిచ్చి అభిమానం.. హీరోపై అభిమానంతో రూ.72 కోట్లు ఆస్తులను రాసిన లేడీ ఫ్యాన్..

ఇదేం పిచ్చి అభిమానం.. హీరోపై అభిమానంతో రూ.72 కోట్లు ఆస్తులను రాసిన లేడీ ఫ్యాన్..

కొందరు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలపై అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకుంటుంటారు. ఈ క్రమంలో హీరోల పుట్టిన రోజులప్పుడు, సినిమాల రిలీజ్ సమయంలో పాలాభిషేకాలు చెయ్యడం, అన్నదానాలు, రక్తదానాలు వంటివి చేస్తుంటారు. కానీ ఓ స్టార్ హీరో పై అభిమానంతో లేడీ ఫ్యాన్ ఏకంగా రూ.72 కోట్లు వాల్యూ చేసే ఆస్తులు స్టార్ హీరో పేరు మీద రాసిన ఘాటైన బాలీవుడ్ లో వెలుగు చూసింది.

పూర్తివివరాల్లోకి వెళితే  నిషా పాటిల్ అనే అభిమాని తన మరణానికి ముందు తన మొత్తం రూ. 72 కోట్ల విలువైన ఆస్తిని బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పై రాసింది. ఈ విషయాన్ని పోలీసులు సంజయ్ దత్ కి తెలియజేయగా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ విషయంపై సంజయ్ దత్ స్పందిస్తూ ఆమె అభిమానాన్ని అభినందించాడు. 

ALSO READ | Ram Charan: డెడికేషన్ అంటే ఇది: 103 డిగ్రీల జ్వరంతో షూటింగ్ కి వెళ్లిన రామ్ చరణ్..

అలాగే తన అభిమాని నిషా పటేల్ చేసిన పని ఆశ్చర్యం కలిగించిందని, తన ఆస్తులని తీసుకోలేనని ఆమె కుటుంబ సభ్యులకి తిరిగి ఇచ్చేయాలని పోలీసులకి సూచించాడు. అంతేకాదు ఆమె నిజమైన వారసులకు ప్రతిదీ తిరిగి వెళ్లేలా చూసుకోవడానికి చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నాడు. దీంతో సంజయ్ దత్ చేసిన ఈ పనికి అభినందిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా సంజయ్ దత్ గత ఏడాది తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సంజయ్ దత్ కానంద స్టార్ ధృవ్ సర్జా హీరోగా నటిస్తున్న కేడీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.