మెట్రో స్టేషన్ సమీపంలో యంగ్ లేడీ ఎస్సై హత్య

మెట్రో స్టేషన్ సమీపంలో యంగ్ లేడీ ఎస్సై హత్య

మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి మహిళా ఎస్సై హత్య జరిగింది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న లేడీ ఎస్సై ప్రీతి అహ్లవత్‌ను.. ఆమె బ్యాచ్‌మేట్, ఎస్సై అయిన దీపాన్షు రతి గన్‌తో కాల్చి చంపాడు. ఢిల్లీ, రోహిణి ప్రాంతంలోని మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రీతిపై దీపాన్షు మూడుసార్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ప్రీతి అక్కడికక్కడే మృతి చెందింది. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన దీపాన్షు ఈ దాడి తర్వాత సోనిపట్‌కు వెళ్లి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరూ 2018 బ్యాచ్‌కు చెందిన పోలీసులు. దీపాన్షు.. ప్రీతిని ప్రేమిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ప్రీతికి దీపాన్షు అంటే ఇష్టం లేదని అధికారులు తెలిపారు.

ప్రీతి తూర్పు ఢిల్లీలోని పట్పర్‌గంజ్ ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తుంది. దీపాన్షు రతి కూడా సబ్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ రోహిణిలో రెంటుకుంటున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. శవపరీక్ష కోసం ప్రీతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు నిమిత్తం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.

For More News..

రాత్రికి రాత్రే 16ఏళ్ల యువతి దారుణ హత్య.. తమ్ముడిపైనే అనుమానం

అలుగుతో కరోనా వైరస్ వ్యాప్తి!

చీర బాలేదని ప్రేమపెళ్లి రద్దు

స్పాట్ ఫిక్సింగ్.. క్రికెటర్‌కు 17నెలల జైలు శిక్ష