తమిళ మూవీ తని ఒరువన్(Thani Oruvan) తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు జయం రవి(JayamRavi). అదే మూవీని తెలుగులోధ్రువగా రీమేక్ చేసి రామ్ చరణ్ హిట్ కొట్టారు. ఇక జయం రవి తమిళ నటుడే అయినా డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్గా జయం రవి నుంచి ఇరైవన్( Iraivan) మూవీ రాబోతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన తని ఒరువన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఐ అహ్మద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఇరైవన్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. నయనతార..జయం రవి సినిమాలకి సాధారణంగా సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ వస్తోంది. కానీ ఇరైవన్ మూవీకి ఏ సర్టిఫికెట్ రావడంతో యూనిట్ సభ్యులతో పాటు..ఫ్యాన్స్ కు కూడా షాకింగ్ గా ఉంది. ఈ మూవీలో హింసకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో..సెన్సార్(Censorboard) వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది. ఇక మాస్ ఆడియన్స్ కి పండుగనే చెప్పుకోవాలి.
పాన్ ఇండియా వైడ్ గా నయనతారకు మంచి గుర్తింపు ఉంది. ఇక ఇప్పుడు నయన్ మూవీకి ఏ సర్టిఫికెట్ రావడంతో..కాస్తా డిస్సపాయింట్ అనే చెప్పుకోవాలి. ఏ సర్టిఫికెట్ మూవీ అంటే..18 సంవత్సరాల వయస్సు గల వారు మాత్రమే థియేటర్స్ లో సినిమా చూడటానికి పర్మిషన్ ఉంటుందని అర్ధం. ఇక UA - అంటే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు తల్లిదండ్రుల సమక్షంలో చూడటం అవసరం..అని అర్ధం.
ఈ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే..సైకో-క్రైమ్ థ్రిల్లర్ తో వస్తోన్న ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ అర్జున్ క్యారెక్టర్లో జయం రవి ఇంటెన్సివ్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ యాంగిల్తో పాటు సమాజంలో జరిగే రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మూవీ వస్తోంది.ట్రైలర్లో..అమ్మాయిలని టార్గెట్ చేసి, మర్డర్ చేసే సైకో కిల్లర్ మైండ్ సెట్ని డైరెక్టర్ క్లియర్గా చూపించారు. వరసగా అమ్మాయిలని కిరాతకంగా చంపి..వారి బాడీ పార్ట్స్ని వేరు చేసి, ఆనందం పొందే సైకోని పట్టుకోవడానికి జయం రవి స్పెషల్ ఆఫీసర్గా.. సీరియస్ ఇంటెన్స్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.
ఇక స్టోరీ థీమ్ని.. ట్రైలర్లో చూపించిన డైరెక్టర్ ఆలోచన గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య వచ్చిన మూవీస్లో ట్రైలర్తో అట్ట్రాక్ట్ చేసి సినిమాలతో బోర్ కొట్టిస్తున్న డైరెక్టర్స్ చాలానే ఉన్నారు.ఆ డైరెక్టర్స్ లిస్టులో ఐ అహ్మద్ లేకపోవడం విశేషం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరైవన్ డైరెక్టర్ ట్రైలర్ లోనే సిన్సియర్గా స్టోరీపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా..సైకో కిల్లర్ అమ్మాయిలని చంపే టైంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా ఉంది. ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ మూవీ 2023 సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
#Iraivan has received an “A” rating with just 2 basic mutes & it has a runtime of 2 hours & 33 minutes. It appears to be a raw, violent & intense psycho-thriller ??️?. This marks @actor_jayamravi’s 2nd film to receive an “A” rating after "#AadhiBhagavan." Interestingly, both… pic.twitter.com/F7CU2ikt6w
— KARTHIK DP (@dp_karthik) September 22, 2023