బ్యాంకులో మాయ లేడీ.. డ్రా చేసిన క్షణాల్లో రూ.2 లక్షలు చోరీ

నవీపేట్, వెలుగు: బ్యాంకులో డ్రా చేసిన రూ.2లక్షలను ఓ మాయ లేడీ క్షణాల్లో కొట్టేసిన ఘటన నిజామాబాద్​జిల్లా నవీపేట్ లో జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం.. నవీపేట్ మండల కేంద్రంలోని తడగామకు చెందిన ఐలపురం నడిపి పోశెట్టికి స్థానిక ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్​ఉంది. 

ఇటీవల పంట అమ్మగా వచ్చిన పైసలు అందులో పడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకుకు వెళ్లిన నడిపి పోశెట్టి రూ.2 లక్షలు డ్రా చేశాడు. బ్యాంక్​అధికారి నుంచి పాస్​బుక్ తీసుకుంటుండగా, వెనుకనే నిలబడి ఉన్న ఓ మహిళ రూ.2లక్షలు కొట్టేసి పరారైంది. 

కొద్దిసేపటి తర్వాత గుర్తించిన పోశెట్టి వెంటనే బ్యాంక్ మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించి, స్థానికుల ద్వారా మహిళ సమాచారం అందుకున్నారు. నేరుగా ఆమెకు ఫోన్​చేయడంతో కొట్టేసిన పైసలను తెచ్చి ఇచ్చింది.