రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన లగచర్ల దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సురేష్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరెందర్ రెడ్డి అనుచరుడైన భోగమోని సురేష్ గత వారం రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు.నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు పోలీసులు.
మరో పక్క ఈ కేసు దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.ప్లాన్డ్ ప్రకారమే సురేష్ ఈ దాడికి పాల్పడ్డాడని.. అధికారలపై దాడి జరిగేలా కర్రలు, రాళ్లు, కారంపొడితో సురేష్ ప్రోత్సాహంచాడని పోలీసులు అంటున్నారు. ప్లాన్డ్ ప్రకారమే సురేష్ అజ్జాతంలో ఉంటున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సురేష్ ఫోన్ ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, సురేష్ కోసం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు తెలంగాణలో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు పోలీసులు. లగచర్ల ఘటనకు ముందు ఆ తర్వాత పరిణామాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు ఉన్నతాధికారులు.