గవర్నర్​ను కలిసిన ఉద్యోగుల జేఏసీ

  • లగచర్ల ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా ల‌‌గ‌‌చ‌‌ర్లలో ప్రభుత్వ అధికారుల‌‌పై దాడి చేసినవారిని, దాడికి ప్రేరేపించిన కుట్రదారుల‌‌పై క‌‌ఠిన చ‌‌ర్యల‌‌కు ఆదేశించాల‌‌ని గ‌‌వ‌‌ర్నర్ జిష్ణుదేవ్ వ‌‌ర్మను తెలంగాణ ఉద్యోగుల  జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నేత‌‌లు కోరారు. జేఏసీ చైర్మన్ వి.ల‌‌చ్చిరెడ్డి నేతృత్వంలో మంగ‌‌ళ‌‌వారం జేఏసీ నేత‌‌లు రాజ్‌‌భ‌‌వ‌‌న్‌‌లో గ‌‌వ‌‌ర్నర్‌‌ను క‌‌లిసి వినతిప‌‌త్రం స‌‌మ‌‌ర్పించారు.

 రైతుల మాటున కొంద‌‌రు దుండ‌‌గులు అధికారుల‌‌పై దాడికి పాల్పడ‌‌టం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింద‌‌ని గ‌‌వ‌‌ర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘ‌‌ట‌‌న‌‌ల‌‌పై చ‌‌ర్యలు తీసుకోక‌‌పోతే దాడులు పెరిగే ప్రమాదం ఉంద‌‌నే ఆందోళ‌‌న ఉద్యోగుల్లో నెల‌‌కొంద‌‌న్నారు. ఉద్యోగులు సుర‌‌క్షిత వాతావ‌‌ర‌‌ణంలో విధులు నిర్వర్తించే ప‌‌రిస్థితులు క‌‌ల్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాల‌‌ని  గవర్నర్ కు రిక్వెస్ట్ చేశారు. తమ వినతికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని లచ్చిరెడ్డి మీడియాకు తెలిపారు.