Pragya Nagra: తెలుగు హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం...

Pragya Nagra: తెలుగు హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం...

Pragya Nagra: ఈమధ్య కాలంలో ప్రతిఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో సోషల్ మీడియా వినియోగం బాగానే పెరిగింది. దీంతో సినీ సెలబ్రెటీలు కూడా అప్పుడప్పుడు తమకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇతర అప్డేట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదే అదునుగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు సినీ సెలెబ్రెటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఐతే మలయాళ యంగ్ హీరోయిన్ ప్రజ్ఞ నగ్రా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో కొందరు కేటుగాళ్లు పాపులర్ అవ్వడం కోసం ప్రజ్ఞ నగ్రా ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ప్రజ్ఞ ప్రయివేట్ వీడియో లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రజ్ఞా నగ్రాకి సంబందించిన ఫోటోలను కొందరు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

కానీ ఈ విషయంపై ఇప్పటివరకూ ప్రజ్ఞ మాత్రం స్పందించలేదు. కాగా ప్రస్తుతం ప్రజ్ఞకి ఇంస్టాలోదాదాపుగా 10 లక్షలపై చిలుకు ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో కొందరు ప్రజ్ఞ అభిమానులు స్పందిస్తూ తమ అభిమాన నటి గురించి తప్పుడు ఫోటోలు, వీడియోలు వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరుతున్నారు. అలాగే మార్ఫింగ్ వీడియోలు కట్టడి చెయ్యకపోతే భవిష్యత్ లో సోషల్ మీడియా వినియోగించేవారి ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని కాబట్టి వీటిని అరికట్టే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ALSO READ : Pushpa2TheRule: హిందీలో పుష్ప 2 ర్యాంపేజ్.. మొదటి రోజే 72 కోట్లు కలెక్ట్ చేసి షారుఖ్ ఖాన్ రికార్డు బ్రేక్..

ఈ విషయం ఇలా ఉండగా ప్రజ్ఞ తెలుగులో యంగ్ డైరెక్టర్ రమేష్ దర్శకత్వం వహించిన లగ్గం అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ హీరో సాయి రోనక్ హీరోగా నటించగా సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.