
సాయి రోనక్, గనవి లక్ష్మణ్ జంటగా ‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఫేమ్ రమేష్ చెప్పాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లగ్గం’. రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘తెలంగాణ పెళ్లిని కనుల విందుగా చూపించబోతున్నాం, ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా ఈ చిత్రం ఉంటుంది’ అని చెప్పాడు.
ఇప్పటివరకూ పెళ్లి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఇది ఉంటుందని, తెలంగాణదనం ఉట్టిపడే విధంగా తీస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కొన్ని తరాలు గుర్తుంచుకునే సినిమా అవుతుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.
రోహిణి, సప్తగిరి, ఎల్.బి. శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, ప్రభాస్ శ్రీను, సత్తన్న ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు.