బీజేపీకి లగిశెట్టి శ్రీనివాస్ రాజీనామా

రాజన్న సిరిసిల్ల: బీజేపీకి గుడ్ బై చెప్పారు ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిశెట్టి శ్రీనివాస్. బీజేపీలో తనకు న్యాయం దక్కలేదని..బీసీలకు న్యాయం చేయకుండా పారాచూట్ నాయకులకు టికెట్ ఇస్తున్నారని లగిశెట్టి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. సిరిసిల్ల నియోజకవ్గంలో 80 శాతం బీసీలు  ఉన్నారు.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని లగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల టికెట్ ఇస్తానని బండి సంజయ్ చెబితేనే బీజేపీలో చేరానని.. తనకు కాకుండా పారాచూట్ నేతలకు టికెట్ ఇచ్చారని లగిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. 

Also Read :- ఈ ఎన్నికల్లో పోటీ చేయం.. కాంగ్రెస్ కు మద్దతు