వికారాబాద్, వెలుగు: ఈ నెల13 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ ఉప్పల్‌లోని సృజన హై స్కూల్వేదికగా రాష్ట్ర స్థాయి లగోరి పోటీలు నిర్వహిస్తున్నట్లు లగోరి అసోసియేషన్రాష్ట్ర అధ్యక్షుడు టి.సదానంద్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నవీన్కుమార్తెలిపారు. వికారాబాద్‌జిల్లా కేంద్రంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారని చెప్పారు. బాలురు, బాలికల టీమ్స్ఉంటాయని ఒక్కో టీమ్‌లో 12 నుంచి 15 మంది క్రీడాకారులు ఉంటారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2022–23 సంవత్సరంలో లగోరిని జాతీయ క్రీడగా గుర్తించిందని, జనవరి 21, 22, 23వ తేదీల్లో బిహార్‌లో జాతీయ స్థాయి లగోరి పోటీలు ఉంటాయన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 33 దేశాల్లో లగోరి పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. స్కూల్గేమ్స్ఫెడరేషన్ లోనూ లగోరి పోటీలకు గుర్తింపు ఉందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సర్టిఫికేట్అందజేస్తామని, స్పోర్ట్స్‌కోటాలో 5 శాతం రిజర్వేషన్ పొందొచ్చని వివరించారు. సమావేశంలో నాయకులు అమరేందర్‌రెడ్డి, సాయికృష్ణ, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.