SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది

SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికా శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. డర్బన్‌లోని వేదికగా కింగ్స్‌మీడ్‌లో జరుగుతున్న  ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లహిరు కుమార తన పేస్ తో బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ 18 ఓవర్లో ఒక అద్భుతమైన బంతిని వేసి సఫారీ బ్యాటర్ బెడింగ్‌హామ్‌ ను బౌల్డ్ చేశాడు. కుమార వేసిన డెలివరీ గంటకు 142 కి.మీల వేగంతో బయట పిచ్ అయ్యి లోపలికి వెళ్ళింది. ఈ ఇన్ స్వింగ్ ను బేడింగ్‌హామ్, డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. 

బంతి బ్యాట్ ప్యాడ్ మధ్యలో వెళ్లడంతో అతను బౌల్డయ్యాడు. ఈ బంతికి వికెట్ మూడు స్టెప్పులు ఎగిరి పడడం విశేషం. బాల్ పేస్ కు బెడింగ్‌హామ్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. దీంతో కేవలం 6 బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ వికెట్ తో పాటు స్టబ్స్ కుమార వికెట్ కూడా తీసుకున్నాడు. లంక పేసర్లు విజృంభించడంతో సౌతాఫ్రికా తొలి సెషన్ లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది.  

Also Read :  రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం

ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 20.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడం లంకకు కలిసి వచ్చింది. లంక పేసర్ల ధాటికి మార్కరం (9), జార్జి (4), బేడింగ్‌హామ్(4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. కెప్టెన్ టెంబా బావుమా 47 బంతుల్లో అజేయంగా 28 పరుగులు చేసి సౌతాఫ్రికా జట్టును నడిపిస్తున్నాడు. అతనితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రైన్ (9) క్రీజులో ఉన్నారు.